కేసీఆర్ కుటుంబ పాలన అంతానికే నా పాదయాత్ర – షర్మిల

sharm

తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్‌ తెలంగాణ పేరుతో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల..తండ్రి , అన్న బాటలో తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టింది. తన తండ్రి , అన్న ఎలాగైతే పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టాలు తెలుసుకున్నారో..షర్మిల కూడా అదే బాట పట్టింది. ఈరోజు చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను మొదలుపెట్టింది. తల్లి విజయమ్మ షర్మిల చేపట్టిన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో షర్మిల..కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ అహంకారం దించేందుకే పాదయాత్ర చేస్తున్నాని..కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయడం కోసమే ఈ పాదయాత్ర అని అన్నారు. ఇదే చేవెళ్ల నుంచి 18 ఏళ్ల క్రితం వైఎస్సార్‌ తొలి అడుగు పడిందని గుర్తుచేశారు. తెలంగాణలోని ప్రతి పల్లెకు వస్తానని.. వారితో మమేకం అవుతానని షర్మిల ప్రకటించారు. తెలంగాణలో సమస్యలు లేవని నిరూపిస్తే.. తన ముక్కు నేలకు రాస్తానంటూ షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతిని బయట పెడతానని.. కేసీఆర్‌కు అమ్ముడుపోయిన కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతానంటూ షర్మిల పేర్కొ్న్నారు. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని.. కళ్లముందు 1.90లక్షల ఉద్యోగాలు కనిపించినా నోటిఫికేషన్లు లేవంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

టిఆర్ఎస్ కు అమ్ముడుపోయిన కాంగ్రెస్ ను చీల్చి చెందడానికే ఈ పాదయాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని…ఏడేళ్ళల్లో ప్రతి వర్గాన్ని మోసం చేశారన్నారు. నంబర్ వన్ అద్వన్నమైన సీఎం ఎవరంటే కేసీఆర్ అని ఓ సర్వే చెబుతుందని ఎద్దేవా చేశారు. పేదోళ్లకు కరోనా వస్తే గాంధీ ఆసుపత్రికి పొమ్మన్నారని… అదే కేసీఆర్ కు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి పోయారని మండిపడ్డారు. వేల కోట్ల సంపదను కేసీఆర్ నీటిపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్‌ను అరువుతెచ్చుకొని అధ్య‌క్షుడిని చేసింద‌ని, ఏడేళ్ల‌పాటు రేవంత్ రెడ్డి ఎక్క‌డ ఉన్నార‌ని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. రాజ‌న్న సంక్షేమ రాజ్యాన్ని తిరిగి తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తామ‌ని ష‌ర్మిల తెలిపారు.