నాలుగోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
నేడు పెట్రోలుపై 89, డీజిల్‌పై 86 పైసల పెంపు

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ రోజు లీటర్ పెట్రోల్‌పై 89 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోలుపై 89 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెంచాయి. ఫలితంగా హైదరాబాద్‌లో ఇప్పుడు లీటరు పెట్రోలు ధర రూ. 111.80కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 98.10కి పెరిగింది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ. 113.60 కాగా, డీజిల్ ధర సెంచరీకి చేరువైంది. రూ.99.50గా ఉంది. ఈ ఐదు రోజుల్లో పెట్రో ధరలు లీటరుకు రూ.3.20 పెరిగాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం ఆరు గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/