భారతదేశం ధర్మసత్రం కాదు

సీఏఏను ఏ కారణంతో వ్యతిరేకిస్తున్నారో చెప్పండి

subramanian swamy
subramanian swamy

హైదరాబాద్‌: సీఏఏను వ్యతిరేకిస్తున్న వారు ఏ కారణంతో వ్యతిరేకిస్తున్నారో స్పష్టం చేయాలని బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. సీఏఏ చట్టం చూసి దేశంలోని ఇతర మతాల వారెవ్వరూ భయపడటం లేదని, కేవలం ముస్లింలే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని స్వామి ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఎవరు పడితే వారు భారతదేశంలోకి చొరబడి యథేచ్చగా నివసించడానికి భారతదేశం ధర్మసత్రం కాదని సుబ్రమణ్య స్వామి మండిపడ్డారు. ఐరాసా నిబంధనల ప్రకారం కూడా ఆర్థిక ప్రయోజనాల కోసం ఏ దేశంలోనైనా ప్రవేశించే వారిని శరణార్థులుగా పరిగణించరని గుర్తు చేశారు. రొహింగ్యాలు పాకిస్థాన్‌ను తమ దేశంగా పేర్కొంటూ 1944లో జిన్నా హయాంలోనే సంతకాలు చేశారని, అటువంటి వారిని ఎట్టి పరిస్థిత్లోనూ భారతదేశ పౌరులుగా గుర్తించరని స్పష్టం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/