మునుగోడు ఉప ఎన్నిక బరిలో YSRTP

నిన్నటి వరకు మునుగోడు ఉప ఎన్నిక బరిలో బిజెపి , టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు మాత్రమే బరిలోకి దిగుతాయని అంత అనుకున్న తాజాగా వైఎస్సార్టీపీ కూడా పోటీ సై అంటున్నట్లు తెలుస్తుంది. . ఈ ఉప ఎన్నికను టిఆర్ఎస్ , బిజెపి , కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని సన్నాహాలు చేస్తున్నాయి. ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. సభలు , సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

ఈ పార్టీలతో పాటు వైఎస్సార్టీపీ కూడా పోటీ చేయబోతున్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపాల‌ని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యించారు. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్య‌ర్థిగా ఎవ‌రిని బ‌రిలోకి దించాల‌న్న విష‌యంపై ఇప్ప‌టికే కసరత్తులు ప్రారంభించిన ఆమె న‌లుగురి పేర్ల‌ను షార్ట్ లిస్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. త్వరలో అభ్యర్థిని ప్రకటించబోతున్నట్లు వినికిడి. మరోపక్క ఈ వారంలోనే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించబోతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ తెలిపారు.