లైగర్ మూవీ టాక్..

యావత్ అభిమానులు , సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్న లైగర్ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కిన చిత్రం లైగర్. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా .. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్, రమ్యకృష్ణ లు కీల‌క పాత్ర‌లో నటించారు. చార్మీ పూరితో కలిసి బాలీవుడ్ మేకర్స్ కరణ్ జోహార్ హీరూ జోహార్ అపూర్వ మోహతా ధర్మా ప్రొడక్షన్స్ పై పూరి కనెక్ట్స్ తో కలిసి ఈ మూవీని నిర్మించారు.

ఇండియా లో ఉదయం నుండే షోస్ మొదలవ్వగా..యూఎస్ లో అర్ధరాత్రి నుండే లైగర్ సందడి మొదలైంది. ఇక సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా అంత బాగుందని..అక్కడక్కడా కాస్త స్లో గా ఉందని అంటున్నారు. విజయ్ దేవరకొండ అదరగొట్టాడని చెపుతున్నారు. మైక్ టైస‌న్ ను ఇంకాస్త వాడుకోవాల్సిందని చెపుతున్నారు. ఇక అనన్య జస్ట్ సాంగ్స్ , అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం చేసారని అంటున్నారు. రమ్య కృష్ణ మరోసారి మెప్పించిందని చెపుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపించినా.. ఆ తర్వాత వచ్చే ఎంగేజింగ్ సీన్స్ బాగున్నాయని.. ఈ సినిమా మాస్‌కు ఫుల్ మీల్స్ అని.. మంచి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ అంటూ కొనియాడుతున్నారు. పూర్తి రివ్యూస్ వస్తే కానీ సినిమా పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది.