కరోనా బారినపడిన జీహెచ్ఎంసీ మేయ‌ర్

హైదరాబాద్ GHMC మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి కరోనా బారినపడ్డారు. దాదాపు మూడేళ్లు కావొస్తున్న కరోనా మహమ్మారి ఉదృతి తగ్గడం లేదు. రెండు , మూడు డోస్ ల వాక్సిన్లు వేసుకున్నప్పటికీ ఒంట్లోకి కరోనా సోకుతుంది. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ గద్వాల్ విజయ లక్ష్మికి కరోనా సోకింది. ఆమె స్వల్ప అస్వస్థతకు గురికావడంతో టెస్ట్ చేయించుకోగా మేయర్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

ప్ర‌స్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకొని, జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని మేయ‌ర్ సూచించారు. మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో ఈ నెల 29న జ‌ర‌గాల్సిన జీహెచ్ఎంసీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం వాయిదా ప‌డింది. వినాయ‌క చవితి ఉత్స‌వాల అనంత‌రం స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి.