ఎవడ్రా అడిగేది..అంటూ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు

వైస్ షర్మిల తన దూకుడు ను పెంచింది. తెలంగాణ సర్కార్ ఫై నేతల ఫై మాటల యుద్ధం చేస్తుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, రుణమాఫీ , ఫీజు రీయింబర్స్ మెంట్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉద్యోగాలు , పోడు పట్టాలు ఇవ్వకపోవడం వంటి వాటి గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తుంది. కాగా టిఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ ఫై షర్మిల ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది.

నేను ఇక్కడ పెరిగిన.. ఇక్కడ చదువుకున్న.. ఇక్కడ పెండ్లి చేసుకున్న.. నా బతుకు ఇక్కడే.. నా భవిష్యత్తు ఇక్కడే.. అలాంటప్పుడు ఇది నా తెలంగాణ కాకుండా ఎట్లవుతది? ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం నా బాధ్యత కాదా? ఎవడ్రా అడిగేది నన్ను? అంటూ ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం సబ్బండ వర్గాల సమాహారం. ప్రతి ఒక్కరి బాధలు వింటాం. వెన్ను తట్టి భరోసా కల్పిస్తాం. అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులతో పాటు చిరువ్యాపారులకు అండగా ఉంటామని షర్మిల భరోసా కల్పించారు.