ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు సైకోపాలనపై ప్రజావిజయం – నారా లోకేష్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లిన్ స్వీప్ చేయడం తో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహం మొదలైంది. నిన్నటి వరకు ప్రజల్లో పార్టీ ఫై నమ్మకం ఉందో ..లేదో..రాబోయే ఎన్నికల్లో గెలుస్తామో లేదో అనే చిన్న సందేహం టీడీపీ శ్రేణుల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఫలితాలతో ప్రజలు మళ్లీ టీడీపీ ని కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమైందని భావిస్తున్నారు. ఈ ఫలితాలతో మరింతగా వైస్సార్సీపీ ఫై దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరుసపెట్టి నేతలు వైస్సార్సీపీ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో యువగళం పాదయాత్ర లో బిజీ బిజీ గా ఉన్న లోకేష్ వైస్సార్సీపీ ఫై తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 47వ రోజు (ఆదివారం) కదిరి నియోజకవర్గం నల్లచెరువు శివార్లలో 600 కిలోమీటర్ల మార్కును చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పాదయాత్ర 600 కి.మీ చేరుకున్న సందర్భంగా చిన్నయల్లంపల్లి వద్ద టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ పథకంలో భాగంగా కటారుపల్లె వద్ద వేమన సమాధి, గొటిబాయిలు గ్రామంలో తిమ్మమ్మ మర్రిమాను, చెర్లోపల్లి రిజర్వాయర్ బోటింగ్, బట్రేపల్లె వాటర్ ఫాల్స్ , శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని , టీడీపీ ప్రభుత్వం రాగానే కార్యాచరణ ప్రారంభిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ ఫలితాలపై లోకేష్ మాట్లాడుతూ..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు సైకోపాలనపై ప్రజావిజయం అన్నారు. అధికార మదం తలకెక్కి నా వెంట్రుక కూడా పీకలేరు అన్నావ్… ప్రజలు ఏకంగా నీకు గుండు కొట్టించారని ఎద్దేవా చేసారు. ఇది ట్రైలర్ మాత్రమే… అసలు సినిమా 2024లో చూపిస్తాం అని లోకేష్ అన్నారు. ఎన్నికల ముందు సెమీఫైనల్స్ అన్నవాళ్లు… ఫలితాలు వచ్చాక తూచ్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.