రికార్డు ధర పలికిన షేన్‌ వార్న్‌ క్యాప్‌

క్రికెట్‌ జ్ఞాపకం గా వార్న్‌ బ్యాగీ గ్రీన్‌(ఆస్ట్రేలియా క్రికెటర్లు ధరించే క్యాప్‌)

Shane Warne
Shane Warne

సిడ్నీ: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ తన బ్యాగీ గ్రీన్‌(ఆస్ట్రేలియా క్రికెటర్లు ధరించే క్యాప్‌)ను వేలానికి పెట్టగా అది ఆల్‌టైమ్‌ రికార్డు ధర పలికింది. తన బ్యాగీ గ్రీన్‌ క్యాప్‌ను వేలంలో ఉంచగా… అది ఊహించని ధరకు అమ్ముడుపోయింది. కార్చిచ్చులో 24మందికి పైగా ప్రాణాలు కోల్పోగా… లక్షలాది వన్యప్రాణులను మంటల్లో దగ్ధం చేసింది. ఈ నేపథ్యంలో కార్చిచ్చు బాధితుల‌కు విరాళాం ఇచ్చేందుకు షేన్ వార్న్ తన బ్యాగీ గ్రీన్‌ను వేలానికి ఉంచగా దానిని సిడ్నీకి చెందిన ఓ వ్యక్తి 5,29,500 డాలర్లకు సొంతం చేసుకున్నాడు. ఫలితంగా అత్యంత ధర పలికిన ఓ ‘క్రికెట్‌ జ్ఞాపకం’గా వార్న్‌ బ్యాగీ గ్రీన్‌ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ బ్యాగీ గ్రీన్‌ను అధిగమించింది. గతంలో డాన్ బ్రాడ్‌మన్‌ బ్యాగీ గ్రీన్‌ను వేలం పెట్టగా అది 4,25,00 డాలర్లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు ఆ రికార్డుని వార్న్ గ్రీన్ బ్యాగీ అధిగమించింది. ఇక, ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ మూడో స్థానంలో నిలిచింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/