విరుచుకుపడిన ఆస్ట్రేలియా పేసర్లు

8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం

Australia win by 8 wickets
Australia win by 8 wickets


అడిలైడ్‌ : ఆస్ట్రేలియాతో జరిగిన గులాబీ టెస్టులో టీమిండియా పరాజయం పొందింది. మూడో రోజే ముగిసిన ఈ టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ పేసర్లకు దాసోహమన్నది. టెస్టుల్లో తమ అత్యల్ప స్కోరును నమోదు చేస్తూ 36 పరుగులకే కుప్పకూలడంతో ఆసీస్‌ సునాయాసంగా విజయాన్నందుకుంది.

రెండో రోజు స్కోరు వికెట్‌ నష్టానికి 9 పరుగులతో ఆట కొనాసాగించిన టీమిండియా మూడో రోజు కేవలం 15.2 ఓవర్లు ఆడి మరో 27 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటయింది. అనంతరం ఆస్ట్రేలియా 21 ఓవర్లలో 2 వికెట్లకు 93 పరుగులు చేసి గెలుపొందింది. ఇలా మూడు రోజులలోపే భారత జట్టు ఓడిపోవడం ఈ యేడాది మూడోసారి.

ఈ యేడాది అరంభంలో న్యూజిలాండ్‌ పర్యటనలో రెండు టెస్టులలోనూ మూడు రోజుల్లోనే ఓటమిపాలయింది. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా చెన్నై టెస్టులో ఇంగ్లండ్‌పై తమ అత్యధిక స్కోరు(759/7) నమోదు చేసింది.

ఇపుడు తద్విరుద్ధంగా టెస్టుల్లో తమ అత్యల్ప స్కోరు(36)కు ఆలౌటయింది. డే-నైట్‌ టెస్టుతో ఆరంభమైన సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌, తొలి ఇన్నింగ్స్‌లో వారి టాప్‌ స్కోరర్‌ టిమ్‌ పెయిన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రెండో టెస్టు మెల్‌బోర్న్‌లో బాక్సింగ్‌ డే(డిసెంబరు 26)న ఆరంభమౌతుంది.

పిచ్‌లో ఎలాంటి మార్పు లేనప్పటికీ ఆసీస్‌ బౌలర్ల ప్రతిభావంతమైన బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ పేలవ ప్రదర్శన చేశారు. హాజల్‌వ్ఞడ్‌, పాట్‌ కమిన్స్‌ పాస్ట్‌బౌలింగ్‌ రుచి ఏమిటో చూపించారు. వారిద్దరు ఇండియా ఇన్నింగ్స్‌ను కకావికలం చేశారు. ఒక్కరుకూడా రెండంకెల స్కోరు సాధించలేకపోయారంటే భారత బ్యాటింగ్‌ ఎంత అవమానకరంగా సాగిందో ఊహించవచ్చు.

తొలుత రెండోరోజు నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన బుమ్రాను కమిన్స్‌ పెవిలియన్‌ బాట పట్టించాడు. తన తరువాతి ఓవర్లో పుజారాను బలిగొన్నాడు. ఈ దశలో హాజల్‌వ్ఞడ్‌ ఒకే ఓవర్లో మయాంక్‌ అగర్వాల్‌, అజింక్య రహానె వికెట్లు దక్కించుకుని కోహ్లీ సేనను చావ్ఞదెబ్బతీశాడు. తరువాతి వంతు కోహ్లీది. తొలి ఇన్నింగ్స్‌లో భారత టాప్‌స్కోరర్‌గా నిలిచిన కోహ్లీ ఈసారి నాలుగు పరుగులకే వెనుతిరిగాడు.

ఆపై హాజల్‌వ్ఞడ్‌ వరుస బంతులలో సాహా, అశ్విన్‌లను అవ్ఞట్‌ చేయడంతో ఇండియా 26 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి దయనీయ స్థితికి చేరుకుంది. టెస్టులలో న్యూజిలాండ్‌ పేరిట ఉన్న అత్యల్ప స్కోరు(28 ఆలౌట్‌)ను దాటలేదేమోననిపించింది.

కానీ హనుమ విహారి ఒక బౌండరీతో ఆ ప్రమాదాన్ని తప్పించాడు. హాజల్‌వ్ఞడ్‌ విహారిని అవ్ఞట్‌ చేయడంతో టెస్టుల్లో ఇండియా తమ గత అత్యల్ప స్కోరును దాటుతుందా అని అనుమానం వ్యక్తమైంది. ఆ అనుమానం నిజం చేస్తూ కమిన్స్‌ వేసిన ఒక షార్టపిచ్‌ బంతి షమి మణికట్టును బలంగా తాకడంతో అతడు బాధతో విలవిలలాడాడు.

ఫిజియోవచ్చి వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. దీనితో ఇండియా రెండో ఇన్నింగ్స్‌ 36 పరుగులవద్ద ముగిసింది. హాజల్‌వ్ఞడ్‌ 5, కమిన్స్‌ 4 వికెట్లు దక్కించుకున్నారు.
విజయానికి 90 పరుగులే అవసరం కావడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను సావధానంగా ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్‌లోవలె భారత పేసర్లు ప్రభావం చూపలేకపోయారు. ఓపెనర్లు మాథ్యూ వేడ్‌, జో బర్న్స్‌ తొలి వికెట్‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యంతో ఆసీస్‌ విజయాన్ని ఖాయం చేశారు. 70 పరుగులు జోడించిన అనంతరం మాథ్యూ వేడ్‌ రనౌట్‌ అయ్యాడు.

వేడ్‌ 53 బంతుల్లో అయిదు ఫోర్లతో 33 పరుగులు చేశాడు. తరువాత వచ్చిన లబుషేన్‌ ఆరు పరుగులకే నిష్క్రమించినా మరో ఓపెనర్‌ బర్న్స్‌ ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఒక సిక్సర్‌తో తన అర్ధసెంచరీ పూర్తిచేసుకోవడమేగాక, అసీస్‌ విజయాన్ని పూరించాడు.

స్కోర్‌బోర్డ్‌ : ఇండియా మొదటి ఇన్నింగ్స్‌ – 244; ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌ – 191; ఇండియా రెండో ఇన్నింగ్స్‌ – పృధ్వీ షా బి కమిన్స్‌ 4, మయాంక్‌ అగర్వాల్‌ సి పైన్‌ బి హాజల్‌వ్ఞడ్‌ 9, జస్ప్రీత్‌ బుమ్రా సి అండ్‌ బి కమిన్స్‌ 2, చతేశ్వర్‌ పుజారా సి పైన్‌ బి కమిన్స్‌ 0, విరాట్‌ కోహ్లీ సి గ్రీన్‌ బి కమిన్స్‌ 4, అజింక్య రహానె సి పైన్‌ బి హాజల్‌వ్ఞడ్‌ 0, హనుమ విహారి సి పైన్‌ బి హాజల్‌వ్ఞడ్‌ 8, వృద్ధిమాన్‌ సాహా సి లబుషేన్‌ బి హాజల్‌వ్ఞడ్‌ 4, రవిచంద్రన్‌ అశ్విన్‌ సి పైన్‌ బి హాజల్‌వ్ఞడ్‌ ఉమేశ్‌ యాదవ్‌ నాటౌట్‌ 4, మహ్మద్‌ షమి రిటైర్డ్‌ హర్ట్‌ 1, ఎక్స్‌ట్రాలు 0, మొత్తం(21.2 ఓవర్లలో 9 వికెట్లకు)36.

వికెట్ల పతనం : 1-7, 2-15, 3-15, 4-15, 5-15, 6-19, 7-26, 8-26, 9-31.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 6-3-7-0; పాట్‌ కమిన్స్‌ 10.2-4-21-4; జోష్‌ హాజల్‌వ్ఞడ్‌ 5-3-8-5.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ –

మాథ్యూ వేడ్‌ రనౌట్‌(33), జో బర్న్స్‌ నాటౌట్‌ 51, మార్నస్‌ లబుషేన్‌ సి మయాంక్‌ అగర్వాల్‌ బి రవిచంద్రన్‌ అశ్విన్‌ 6, ఎక్స్‌ట్రాలు 2, మొత్తం(21 ఓవర్లలో 2 వికెట్లకు)93.
వికెట్ల పతనం : 1-70, 2-82.
బౌలింగ్‌ : ఉమేశ్‌ యాదవ్‌ 8-1-49-0; జస్ప్రీత్‌ బుమ్రా 7-1-27-0; రవిచంద్రన్‌ అశ్విన్‌ 6-1-16-1.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/