చదువుల విప్లవం దిశగా ఏపీ అడుగులు వేస్తోంది

పిల్లలను బడికి పంపితే చాలు ఏటా రూ.15వేలు ఇస్తామని మాటిచ్చాను

Y. S. Jaganmohan Reddy
Y. S. Jaganmohan Reddy

అమరావతి: దేశంలో ఎక్కడాలేని విధంగా చదువుల విప్లవం దిశగా ఆంధ్రప్రదేశ్‌ అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. పిల్లలను బడికి పంపితే చాలు ఏటా రూ.15వేలు ఇస్తామని మాటిచ్చాను. ఆ మాటను నిలబెట్టుకుంటూ రూ.6450 కోట్లతో అమ్మఒడి పథాకాన్ని ప్రారంభించామని సీఎం తెలిపారు. అమ్మఒడి ద్వారా 43 లక్షల మంది తల్లులు, 82 లక్షల మంది పిల్లలకు లబ్ధిచూకురుతందని ముఖ్యమంత్రి జగన్‌ ట్వీట్‌ చేశారు. ఇంకా మరో ట్వీట్‌లో మధ్యాహ్న బోజన మెనూలో మార్పులతో విద్యార్థులతో నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించబోతున్నామని ప్రపంచంతో మన పిల్లలు పొటీపడేలా ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాం. ప్రభుత్వ పాఠాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు నాడు-నేడు వంటి విప్లవత్మాక కార్యక్రమాల ద్వారా..చదువులే ఈ ప్రభుత్వ తొలి ప్రాదాన్యత అని చాటి చెప్పామని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/