ధరల మంటతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి
బంగారం నుంచి ఉల్లిగడ్డ వరకూ ఏ వస్తువును కదిలించినా ధరలు ఆకాశం అంటుతున్నాయి

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనానికి తోడు ధరల మంట సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బంగారం నుంచి ఉల్లిగడ్డ వరకూ ఏ వస్తువును కదిలించినా ధరలు ఆకాశం అంటుతున్నాయి. ధరల మంటతో డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ అంచనాలను మించి ఏకంగా 6.2 శాతానికి ఎగబాకే అవకాశం ఉందని రాయటర్స్ పోల్‌లో ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఈనెల 13న వెల్లడికానున్న డిసెంబర్ ద్రవ్యోల్బణ గణాంకాల్లో రిటైల్ ద్రవ్బోల్బణంపై ఆర్‌బీఐ అంచనా రెండు నుంచి 6 శాతాన్ని అధిగమించి ఏడు శాతం వరకూ ఇది ఎగబాకుతుందని రాయ్‌టర్స్ పోల్‌లో పాల్గొన్న వారిలో 60 శాతం మందికిపైగా అభిప్రాయపడ్డారు. ఉల్లి ధరలు విపరీతంగా పెరగుతుండటంతోనే రిటైల్ ద్రవ్యోల్బణం చుక్కలు చూడటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇతర ఆహారోత్పత్తుల ధరలు పెరిగినా ప్రధానంగా ఉల్లి ధరలు ఇటీవల నాలుగింతలకు పైగా పెరగడమే ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ ఆర్థిక నిపుణులు ఆస్ధా గిద్వాణీ పేర్కొన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/