“శాకుంతలం” రిలీజ్ డేట్ ను ప్రకటించిన మేకర్స్

దర్శకుడు గుణశేఖర్..నిర్మాత దిల్ రాజు కలిసి రూపొందించిన పౌరాణిక చిత్రం శాకుంతలం. ఈ సినిమాలో సమంత కీ రోల్ చేస్తుండగా..మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ఈ సినిమాను నవంబర్‌ 4 వ తేదీన విడుదల చేయనున్నామని తెలిపింది. ఈ మేరకు ఓ రొమాంటిక్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

మహాభారతంలోని ఆదిపర్వంలో దుష్యంతుడి శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దుష్యంతుడి క్యారెక్టర్‌లో మలయాళ హీరో దేవ్ మోహన్ యాక్ట్ చేశారు. తెలుగు, హిందీ, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్పణ‌లో డీఆర్‌పీ, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమా గుణ నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా.. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.