ఓటిటి లో స్ట్రీమింగ్ కు సిద్దమైన శాకుంతలం

గుణశేఖర్ డైరెక్షన్లో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14 న విడుదలై భారీ డిజాస్టర్ గా టాక్ తెచ్చుకుంది. దాదాపు అరవై కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇరవై కోట్లలోపే వసూళ్లను రాబట్టలేదు. ఈ సినిమాతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్ల కు తీవ్రంగా నష్టపోయారు.

ఇక సినిమా ఫలితం తెలియకముందే అమేజాన్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేయడం గమనార్హం. సమంతకు తెలుగుతో పాటు తమిళం హిందీ భాషల్లో ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 20 కోట్ల కు ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కానీ సినిమా డిజాస్టర్ కావడం తో త్వరగా ఓటిటి లో రిలీజ్ చేసి ఎంతోకొంత రాబట్టుకోవాలని చూస్తుంది. ఈ తరుణంలో ఈ నెల మే 12వ తేదీన శాకుంతలం ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలిపింది.