మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మమహ్మద్‌నగర్‌ గేట్‌ వద్ద ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కే ప్రాణాలు కోల్పోగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల్లోకి వెళ్తే..

జీడిమెట్లకు చెందిన దంపతులు ఏడుపాయల దర్శనానికి వెళ్లి తిరుగు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆటో లారీని ఓవర్‌ టెక్‌ చేస్తున్న సమయంలో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో నలుగురికి తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరి తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ, నర్సాపూర్‌ సీఐ లాల్‌ మదర్‌, ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు.