దేశంలో కొత్తగా 3,614 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40,559

corona virus india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు అంతకంతకూ తగ్గుముఖం పడుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా… 3,614 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 89 మంది కరోనా కారణంగా మృతి చెందారు. నిన్న 255గా నమోదైన మరణాల సంఖ్య… ఈరోజు 100కు దిగువకు రావడం గమనార్హం. గత 24 గంటల్లో 5,185 మంది కోలుకున్నారు.

ఇక ఇప్పటి వరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకగా… వారిలో 4.24 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తం 5,15,803 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 40,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 179,91,57,486 డోసుల వ్యాక్సిన్ వేశారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.44 శాతానికి తగ్గింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/