షబానా అజ్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

Shabana Azmi discharged from hospital

Mumbai: బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జనవరి 18న ఆమె ప్రయాణిస్తున్న కారు ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై ఖాలాపూర్ టోల్‌ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిన షబానా 13 రోజులపాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/