బెర్నీ శాండర్స్‌కు భారీగా అందిన విరాళాలు

3.45 కోట్ల డాలర్ల విరాళాలు

Bernie Sanders
Bernie Sanders

అమెరికా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌కు నాల్గవ త్రైమాసికంలో 3.45 కోట్ల డాలర్ల విరాళాలు అందాయి. ఈ మొత్తాన్ని 18 లక్షల మంది సమకూర్చారు. అంటే సగటున ఒక్కొక్కరి నుంచి 18.53 డాలర్లు సమకూరాయన్న మాట. ఒక్క డిసెంబరులోనే కోటి ఎనబై లక్షల డాలర్ల విరాళాలు అందాయి. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం శాండర్స్‌తో పోటీపడుతున్న మిగతా డెమొక్రాట్ల అభ్యర్థులు కూడా నాల్గవ త్రైమాసికంలో తమకు అందిన విరాళాల వివరాలను వెల్లడించారు. వీరిలో పీట్‌ బుటీగీగ్‌కు 2.47 కోట్ల డాలర్లు, ఎలిజిబెత్‌ వారెన్‌ (డిమాస్‌)కు 1.7 కోట్ల డాలర్లు, తులసీ గబార్డ్‌కు 3.4 కోట్ల డాలర్లు విరాళాలుగా అందాయి. రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ నాల్గవ త్రైమాసికంలో అందరికన్నా అత్యధికంగా 4.6 కోట్ల డాలర్ల విరాళాలను సేకరించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/