చలికాలంలో సహజ సీరమ్

Natural serum for winter

ఒక కమలాపండు తొక్కను చిన్న ముక్కలుగా కోసి, ఎండబెట్టాలి.. ఆ ముక్కలను ఒక గిన్నెలో వేసి రెండు టేబుల్ స్పూన్ల గులాబీ నీరు, అర టేబుల్ స్పూను గ్లిజరిన్, మూడు విటమిన్ ఈ క్యాప్సూల్స్ నాణెలను కలపాలి.. వీటన్నింటినీ మిక్సీలో మెత్తగా చేసి., రసాన్ని ;వడగట్టాలి.. ఈ మిశ్రమానికి మూడు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు కలిపి బాగా గిలకొట్టి గాజు సీసాలోకి తీసుకుంటే సరి.. ఫ్రిడ్జ్ లో ఉంచితే, నాలుగు నుంచి ఏడు వారాలపాటు నిల్వ ఉంటుంది.. క్రీం రాయటానికి ముందు ఈ సీరమ్ నాలుగైదు చుక్కలు ముఖానికి రాస్తే సరిపోతుంది.. ఇది చర్మాన్ని తాజాగా, మృదువుగా మారుస్తుంది.. తర్వాత మేకప్ వేసుకున్న సహజ లుక్ రావటం ఖాయం.

రెండు చెంచాల చొప్పుక్ కలబంద గుజ్జు, బియ్యం కడుగు తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పావు చెంచా బాదాం నూనె, రెండు చెంచాల గులాబీ నీరు చేర్చి బాగా కలిపితే చాలు సహజ సిద్దమైన సీరమ్ రెడీ అయినట్టే. రోజూ రాత్రి నిద్రపోయే ముందు శుభ్రపరిచి ముఖానికి రెండు చుక్కలు రాసి, ఆరాక మొయిశ్చరైజర్ పట్టిస్తే చాలు. తెల్లారేసరికి ముఖ చర్మం తాజాగా మారుతుంది..

ఏఈ సీరమ్ లోని సి విటమిన్ చర్మంలోని కొలాజెన్ ఉత్పత్తికి దోహదపడుతుంది.. ఇది చర్మానికి తేమతో పాటు సాగే గుణాన్ని, మెరుపుని అందిస్తుంది.. వృద్ధాప్యం ఛాయలను దరిచేరనివ్వదు. చర్మ రంద్రాలను మూసుకునేలా చేసి మురికి చేరకుండా సంరక్షిస్తుంది.. దీంతో మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు దరిచేరవు.