నడుమునొప్పికి కారణాలు

Causes of waistline Pain
Causes of waistline Pain

నడుము నొప్పి వయసుతో సంబంధం లేకుండా చాలామందిని ఇబ్బంది పెడుతుంది. దీనికి అనారోగ్యాలు, ఆహారపరంగా చెప్పుకునే కారణాలు కాకుండా మరికొన్ని ఉంటాయి. రోజు పడుకునే విధానం, ఎంచుకునే పరుపు కూడా నడుమునొప్పికి కారణం కావచ్చు. మెత్తగా, ఎగుగుదిగుడుగా ఉండే పరుపు కాకుండా సమాంతరంగా ఉండేదాన్ని ఎంచుకుంటే మేలు. అలానే కనీసం ఏడెనిమిది గంటల నిద్ర ఉన్నప్పుడు వెన్నుపూసకు విశ్రాంతి అందుతుంది. నొప్పి సమస్య పెద్దగా ఉండదు. ఇల్లు, ఆఫీసు ఎక్కడయినా సరే ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం, సరిగా కూర్చోకపోవడం, నిలబడకపోవడం వల్ల కూడా నడుము నొప్పి బాధించవచ్చు అంటున్నారు వైద్యులు. ముందు నిటారుగా నిల్చోవడం, కూర్చోవడం అలవాటుగా మార్చుకోవాలి. ఎంత తీరిక లేకున్నా ప్రతి అరగంటకోసారైనా లేచి అటూ ఇటూ నడవటం మేలు. ఇవన్నీ నడుమునొప్పిని అదుపులో ఉంచుతాయి. శరీర బరువు వెన్నుపూస మీద పడుతుంది. అది కూడా నడుమునొప్పికి కారణం కావచ్చు. అందుకే బరువు పెరిగితే ఖచ్చితంగా దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. హ్యాండ్‌బ్యాగ్‌, బ్యాక్‌ప్యాక్‌ ఏదైనా సరే ఎక్కువ బరువు ఉన్నదాన్ని తరచూ మోయడం వల్ల కూడా నడుమునొప్పి రావచ్చు. ఎక్కడయినా సరే ఎక్కువసేపు నిల్చోవడం కూడా సరికాదు. మెట్టు ఎక్కేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకుని ఎక్కాలి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/