కన్నడ సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష

,

కన్నడ సీనియర్ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది కర్ణాటక హైకోర్టు. 1971లో పుట్టిన అభినయ 1984లో తన 13వ ఏట కాశీ విశ్వనాథ్ ‘అనుభవ’ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ తరవాత ఆమెకు అవకాశాలు తగ్గడంతో సీరియల్స్ లోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే ఈమె సోదరుడు వివాదంలో కేసులో ఇరుక్కుంది.

1998లో అభినయ అన్న శ్రీనివాస్‌కు లక్ష్మీదేవితో పెళ్లి అయ్యింది. పెళ్లి సమయంలో 80 వేల రూపాయలు కట్నంగా ఇచ్చారు. నగదు, 250 గ్రాముల బంగారు ఆభరణాలు కూడా ఇచ్చారు. అప్పుడు కూడా లక్ష డిమాండ్ చేసి రూ.20 వేలు శ్రీనివాస్‌ తీసుకున్నాడు. అనంతరం వరకట్నం తేవాలంటూ వేధించి లక్ష్మీదేవిని తల్లిదండ్రుల ఇంటికి పంపించారు. దీంతో లక్ష్మీదేవి డబ్బులు తీసుకురావాలని పలుమార్లు వేధిస్తున్నారని అభినయ కుటుంబంపై చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్ లో 2002లో ఫిర్యాదు చేసింది.

అభినయతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.అయితే 2012లో మెజిస్ట్రేట్ కోర్టు వీరికి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే జిల్లా కోర్టు ఈ తీర్పు పై స్తే విధించింది. దాంతో లక్ష్మీదేవి హైకోర్టులో అప్పీలు వేసింది. ఇన్నాళ్లు ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. ఇప్పటికి తిది తీర్పు వచ్చింది.ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం అభినయ, శ్రీనివాస్, జయమ్మ, చెలువరాజును దోషులుగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది.