స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు..ఎర్ర‌కోట‌, రాజ్‌ఘాట్ వ‌ద్ద నిషేదాజ్ఞ‌లు

Section 144 imposed around Red Fort, Rajghat ahead of Independence Day

న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా ఎర్ర‌కోట‌, రాజ్‌ఘాట్, ఐటీఒ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు నిషేదాజ్ఞ‌లు జారీ చేశారు. ఇండిపెండెన్స్ డే వేడుక‌ల‌ను పుర‌స్క‌రించ‌కుని రాజ్‌ఘాట్, ఐటీఓ, రెడ్‌ఫోర్ట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో 144వ సెక్ష‌న్ కింద నిషేదాజ్ఞ‌లు జారీ చేశామ‌ని, ఈ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు గుమికూడ‌టం అనుమ‌తించ‌బోమ‌ని ఢిల్లీ పోలీసులు ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.

ఆగ‌స్ట్ 15న జ‌రిగే స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎర్ర‌కోట నుంచి జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల నేప‌ధ్యంలో దేశ రాజ‌ధానిలో కీల‌క ప్రాంతాల్లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.