హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

Amit Shah reached Hyderabad

హైదరాబాద్‌ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ మేరకు తెలంగాణ బిజెపి పార్టీ నేతల కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు స్వాగతం పలికారు. ఇక తెలంగాణ పర్యటన నేపథ్యంలో అమిత్ షా గద్వాల, నల్గొండ, వరంగల్ బిజెపి సకల జనుల విజయసంకల్ప సభలలో పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఎమ్మార్పీఎస్ జాతీయ సమావేశంలో పాల్గొననున్నారు.

ఎన్నికల ప్రణాళిక విడుదల అనంతరం సికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్ నేతలతో సమావేశంకానున్నారు. సమావేశం అనంతరం రాత్రి 8 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌కు తిరుగు ప్రయాణంకానున్నారు.