జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు తప్పదు

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

Precautions are required on the new virus-WHO
Precautions are required on the new virus-WHO

Geneva: బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చి యావత్తు ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) మరోమారు హెచ్చరించింది.

కొత్త రకం కరోనా వైరస్ విషయంలో కూడా ఇప్పటి వరకూ మహమ్మారి కట్టడికి అనుసరిస్తున్న జాగ్రత్తలనే పాటించాలని, జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు తప్పదని హెచ్చరించింది.

ఈ కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పటి దాకా అదుపు తప్పలేదని, ఇంత కాలం పాటించినట్లుగానే కరోనా జాగ్రత్తలు పాటిస్తే కొత్త రకం కరోనా వైరస్ ను సమర్ధంగా తిప్పి కొట్టగలమని పేర్కొంది.   అజాగ్రత్త వహిస్తే ప్రమాదం తప్పదని  హెచ్చరించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/