తెలంగాణ వ్యాప్తంగా పోలియో చుక్కలు

కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు

Pulse polio
Pulse polio

Hyderabad: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రారంభమైంది..ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతోపాటు, ప్రభుత్వ , ప్రైవేటు వైద్యశాల్లో సిబ్బంది 0-5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయటం ప్రారంభించారు..

కరోనా నేపథ్యంకారణంగా అన్ని జాగ్రత చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది..వైద్యలు, సిబ్బందికి అవసరమైనసర్జికల్‌ మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లు, డిస్పోజబుల్‌ గ్లౌజులను అందించినట్టు అధికారులు పేర్కొన్నారు..

ఆదివారం నాడు పోలియోచుక్కలు వేయించుకోని చిన్నారుల కోసం సోమ, మంగళవారాల్లో కూడ వైద్య సిబ్బంది ప్రతిఇంటికీ వెళ్లి పోలియోచుక్కలు వేస్తారని అధికారులు తెలిపారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/