బుతువుల మార్పుతో వ్యాధులు
ఆరోగ్య భాగ్యం

వర్షాకాలం:
తమిళంలో కారు కాలం, తెలుగులో కారు అంటే వానా కాలం నలుపు అని అర్థం. దీన్నే వెట్సీజన్, రైయినీ సీజన్, గ్రీన్ సీజన్ అని అంటారు. అధిక వేడి, తేమ, వాతా వరణం, మేఘవృతంగా ఉండడం, వర్షాలు ఎక్కువగా పడడం, తుఫాన్లు, వరదల వల్ల సూక్ష్మజీవుల వృద్ధి వ్యాప్తి ఎక్కువగా ఉం టుంది. నీరు నిల్వ ఉండడం, మంచి నీరు కలుషితం కావడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల, దోమలు, ఈగలు, టిక్స్ వంటి క్రిమికీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది.
నేల తొలకరి జల్లులకి తడవడం వల్ల వచ్చే వాసననే మట్టి వాసన లేదా పెట్రికల్ అని అంటారు. వేసవిలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం, మల మూత్ర విసర్జన చేయడం, చెత్త చెదారం పడవేయడం వల్ల వర్షానికి క్రుళ్లి చెడు వాసన వ్యాపించడం వల్ల బాక్టీరియా, వైరస్ సూక్ష్మజీవులు వృద్ధి చెందడం వల్ల వైరల్ ఫివర్స్, జలుబు, దగ్గులతో పాటు శ్వాసకోశ వ్యాధులు, డెంగ్యూ జాండీస్, చికెన్గూన్యా స్పైన్ ఫ్లూ, కోవిడ్-19. మలేరియా, కలరా, హెప టైటిస్ విరేచనాలు, ఫ్లూ టైఫాయిడ్, కండ్లకలక వంటి
వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశముంది.
తేమ తక్కువగా ఉన్నప్పుడు ఇన్‌ఫ్లుయోంజా వైరస్ ట్రోపికల్ ఏరియాలో శ్వాసకోశ వ్యాధులు, యుఎస్‌లో గనేరియా వ్యాధులు ఎక్కువగా కన్పిస్తాయి.వర్షాకాలంలో సీజినల్ వ్యాధులతో అత్యధిక మంది బాధపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా వీరి సంఖ్య 28-45 మిలియన్ల వరకుంటుంది.
చలికాలం :
ఇది చల్లదనానికి సంబంధించినది. ఇది చళ్/చణ్ నుండి వచ్చింది. తెలుగులో చలి, చలువ అని అర్థం. చలికాలంలో భూమ చల్లబడి సముద్రం వేడిగా ఉండడం వల్ల పీడన వ్యత్యాసం ఏర్పడి ఈశాన్య దిశ నుండి దక్షిణ దిశగా ఋతుపవనాల వల్ల సడన్‌గా తుఫాన్లు ఏర్పడ తాయి.
చలికాలంలో పొగ మంచు ఎక్కువగా ఉండడం, సూర్యరశ్మి తక్కువగా ఉండడం, చలికి ఇంట్లోనే ఉండడం, వెంటిలేషన్ తక్కువగా ఉండడం వల్ల వైరల్, ఫంగల్, ప్రొటోజోవల్ ఇన్ణెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. జలుబు, ఆస్మా, న్యూమోనియా, చర్మ, వ్యాధులు, కీళ్ల నొప్పులు, దీర్ఘ వ్యాధులెక్కువవుతాయి. 5.78 మిలియన్స్ మంది బాధపడు తుంటారు. ఇది సీజనాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కాంప్లెక్స్ రిలేషన్షిప్ (వాతావరణ-సూక్షజీవులు కల్గి ఉంటుంది.
ఇది ఉష్ణోగ్రతలో మార్పు, నీటి సాంద్రత తేమ, ప్రజల స్థితిగతులు, అలవాఉ్ల, సూక్ష్మ జీవుల వృద్ధికి దోహదపడే పరిస్థితులు, పరిశుభ్రత హోస్ట్ బిహేవియర్, ఇమ్యూనిటీ వంటి వివిధ
అంశాలపై ఆధారపడి ఉంటుంది.
కారణాలు :
హ్యుమన్ ఆక్టివిటీ: జన సమర్ష్యమున్న ప్రాంతలు గాలి, వెలుతురు, సరైన వెంటలేషన్ లేని ఇండ్లు, చిత్తడి, తేమ ఉన్న ప్రాంతాలు, మురికివాడలు, ఎడారి ప్రాంతాలు మంచు ప్రాంతాల్లో ఉండడం, డెంపరేచర్లో మార్పులు, సీజనల్ ఎన్విరాన్మెంటల్ ఛేంజ్స్, సీజనల్ క్లోతింగ్ స్టేయిల్స్, హ్యుమన్ బిహేవియరల్ ఎఫెక్ట్స్, ఫిజికల్ అక్టివిటీలో మార్పులు మొదలైన అంశాలు సీజనల్ ఛేంజ్‌ని ప్రభావితం చేస్తాయి.
దీని వల్ల గాలి, కాంటాక్ట్ వల్ల ఇన్ఫెక్షన్స్ వ్యాపిస్తాయి. ఫిజికల్ ఆక్టివిటీ వేసవి, వసంతాకాలంలో ఎక్కువగా ఉండే చలికాలంలో తక్కువగా ఉంటుంది. పిల్లలకి స్కూల్స్, సమ్మర్ క్యాంప్సీలో హస్టల్స్లో ఇన్ణెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశముంది. ఇది సోషల్ ఎకనమిక్ కండీషన్స్‌పై ఆధారపడి ఉంటుంది.
డాక్టర్. కె.ఉమాదేవి,
తిరుపతి
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/