తేజ్ 16 వ సినిమా ప్రారంభం..

సాయి ధరమ్ తేజ్ 16 వ చిత్రం ప్రారంభమైంది. 2021 లో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు యాక్సిడెంట్ అవ్వడంతో తీవ్రంగా గాయ పడ్డాడు.తేజ్ ప్రాణాలతో బయట పడుతాడా అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ దేవుడు దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాల తో బిజీ గా ఉన్నారు.

తాజాగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో తేజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు జయంత్ పానుగంటి దర్శకత్వం వహించబోతున్నాడు. సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంచనంగా జరిగాయి. చిత్ర యూనిట్ సభ్యులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అతి త్వరలోనే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవ్వబోతుందని.. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు పవన్ కళ్యాణ్ నటించబోతున్న వినోదయ్య సిత్తం సినిమా రీమేక్ లో కూడా సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడట. ఆ సినిమా విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.