ఆర్‌కామ్‌కు రూ.104 కోట్లు చెల్లించాల్సిందే

కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

Reliance
Reliance

ఢిల్లీ: రిలయన్స్‌ కమ్యూనికేషన్‌(ఆర్‌కామ్‌)కు కేంద్రం రూ. 104 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టెలికాం డిస్‌ప్యూట్స్‌ సెటిల్‌మెంట్‌ అప్పిటేట్‌ ట్రైబ్యునల్‌(టిడిఎస్‌ఏటి) తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. స్పెక్ట్రమ్‌ ఛార్జీలపై పెట్టిన రూ. 908 కోట్ల పూచీకత్తులో రూ. 774 కోట్ల చార్జీల మొత్తం పోనూ మిగిలినది తిరిగి చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఆర్‌కామ్‌ టిడిఎస్‌ఏటిని ఆశ్రయించింది. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇంకా దాదాపు రూ.104 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. కేంద్రం వాదనలకు బలమైన కారణాలేమీ లేని కారణంగా కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఈ విచారణలో జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌ నారీమన్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే కేంద్ర టెలికాం విభాగం రూ.30.33 కోట్లు రిలయన్స్‌కు చెల్లించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana