భారత్‌ నుండి విమాన రాకపోకలపై సౌదీ నిషేధం

భారత్ తో పాటు బ్రెజిల్, అర్జెంటీనాలపై నిషేధం

saudi arabia
saudi arabia

న్యూఢిల్లీ: భారత్ నుంచి విమాన రాకపోకలపై సౌదీ అరేబియా తాత్కాలిక నిషేధం విధించింది. భారత్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో కరోనాను కట్టడి చేయడంలో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కారణంతో బ్రెజిల్, అర్జెంటీనా విమాన రాకపోకలను కూడా నిషేధించింది. ఈ దేశాల నుంచి వచ్చే సాధారణ ప్రయాణికులపై నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. అయితే, అధికారిక కార్యకలాపాలపై వచ్చేవారి ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/