క్రూడాయిల్‌… భారీగా తగ్గిన ధరలు

Crude Oil prices Down
Crude Oil prices Down

సౌదీ అరేబియా: ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో 20 ఏళ్ల కనిష్టానికి పతనమయ్యాయి.1998లో ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిన వేళ, క్రూడాయిల్ ధరలు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. నేడు ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా వైరస్, అదే విధమైన ప్రభావాన్ని చూపిస్తోంది.

నేడు క్రూడాయిల్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 473 తగ్గి, బ్యారల్ కు రూ. 2,686కు పతనమైంది. అంటే, ఒక్కరోజులోనే దాదాపు 15 శాతం మేరకు ధర తగ్గింది. ఇదే సమయంలో సహజవాయువు ధర 6.96 శాతం పడిపోయి రూ. 120కి దిగి వచ్చింది. ఇదే సమయంలో బంగారం ధర పది గ్రాములకు రూ. 3 తగ్గి 44,155 వద్ద, కిలో వెండి ధర రూ. 1,079 తగ్గి రూ. 45,890 వద్దా కొనసాగుతున్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/