తెలంగాణ రాష్ట్రంలోకి మరో ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీ వచ్చింది

ఐటీ కంపెనీలన్ని ఇప్పుడు తెలంగాణ వైపే చూస్తున్నాయి. భారీ పెట్టుబడులు పెట్టేందుకు పోటీపడుతున్నాయి. అమెరికా తర్వాత మన హైదరాబాద్ లోనే పెద్ద సంఖ్య లో ఐటీ సంస్థలు ఏర్పడ్డాయి. ఈ ఐదేళ్లలో ఎన్నో టాప్ కంపెనీ లు హైదరాబాద్ లో ఏర్పటు లక్షలమందికి ఉపాదికల్పిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీ తెలంగాణాలో అడుగుపెట్టింది. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఈ – సిటీలో విప్రో కన్‌స్యూమర్ కేర్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీతో కలిసి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్బంగా అజీమ్ ప్రేమ్‌జీ మాట్లాడుతూ.. తెలంగాణలో నిరంతరంగా పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకంగా ఉందని కొనియాడారు. కరోనా నియంత్రణలో తెలంగాణ కీలకంగా నిలిచిందన్నారు. పెట్టుబడులతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించుకుంటున్నామని పేర్కొన్నారు. తాము స్థాపించబోయే కంపెనీల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని ప్రేమ్‌జీ తెలిపారు. రూ. 300 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో విప్రో ఫ్యాక్టరీ పెడుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో 90 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వడానికి విప్రో కంపెనీ అంగీకరించిందని ప్రకటించారు. ఈ కంపెనీలో ఉత్పత్తి అయ్యే వస్తువుల తయారీలో భాగంగా ఏర్పడే కాలుష్యం బయటకు విడుదల కాకుండా జర్మన్ సాంకేతికతతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.