పెదనాన్నను నరికి చంపిన యువకుడు

Young man killed his uncle in Adilabad
Young man killed his uncle in Adilabad

ఆదిలాబాద్‌: జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. తన సొంత పెదనాన్ననే, ఓ యువకుడు చంపడంతో ఉట్నూర్‌ మండలం లక్కారం పరిధిలోని గంగన్నపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగన్నపేట గ్రామానికి చెందిన తాళ్లపల్లి శివరాజ్‌ గతంతో ఏఎస్‌ఐగా పనిచేసి రిటైరయ్యారు. అయితే కొంతకాలంగా అతడి తమ్ముడు జయరాజ్‌ కుటుంబంతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం జయరాజ్‌ కొడుకు తన పెదనాన్న అయిన శివరాజ్‌ ను దారుణంగా నరికి చంపేశాడు. చర్చికి వెళ్తున్న సమయంలో అడ్డగించి, తనవెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అనంతరం పెదనాన్న మృతదేహం వద్ద సెల్ఫీ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే విషయం తెలిసిన శివారాజ్‌ భార్య రోజా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/