దుర్గాదేవిగా, మహిషాసుర మర్దనిగా అమ్మవారి దర్శనం

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

Kanaka Durga
Kanaka Durga

Vijayawada: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. శనివారం అమ్మవారు రెండు అంకరణలలో దుర్గాదేవిగా, మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చాన్నారు.

ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు.  మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కోవిడ్‌ నిబంధనల మధ్య దసరా శరన్నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి.

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లకు చేరారు.

జగన్మాతకు ప్రీతిపాత్రమైన దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

ఆన్‌లైన్‌లో టికెట్‌లు బుక్ చేసుకున్న 10వేల మంది భక్తులతో పాటు అంతకు రెండింతల మంది టికెట్‌లు తీసుకుని అమ్మవారి దర్శనానికి వచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/