రుచి: వెరైటీ వంటకాలు ‘దసరా’ ప్రత్యేకం

కట్టె పొంగలి

Katte Pongali
Katte Pongali

కావల్సినవి :
బియ్యం-అరకప్పు, పెసరపప్పు-పావుకప్పు, నీళ్లు-రెండు కప్పులు, ఉప్పు తగినంత, తాలింపుకోసం : నెయ్యి-మూడు చెంచాలు, జీలకర్ర-చెంచా, మిరియాలు-చెంచా, అల్లం-చిన్నముక్క కరివేపాకు-నాలుగు రెబ్బలు, జీడిపప్పులు-పది.

తయారీ :
బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్‌లో తీసుకుని నీళ్లు పోయాలి. మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నెయ్యివేయాలి. అది కరిగాక జీడిపప్పు వేయించాలి.

కాస్త ఎర్రగా వేగాక జీలకర్రా, మిరియాలపొడి, కరివేపాకూ, అల్లం తరుగు వేయాలి. అవి కూడ వేగగాక బాణలి దించేయాలి.

ఈ తాలింపూ, సరిపడా ఉప్పు ముం దుగా ఉడికించి పెట్టుకున్న అన్నం లో వేసి కలపాలి.ఈ పొంగ లిని మరోసారి పొయ్యిమీద పెట్టి రెండు నిమిషాల య్యాక
దింపేయాలి.

Palli Rice

పల్లీ అన్నం

కావల్సినవి : అన్నం-కప్పు (పొడి పొడిగా పండుకోవాలి) పల్లీలు- అర కప్పు, ఉప్పు-రుచికి తగినంత, ఎండు మిర్చి ఆరు, నూనె-రెండు చెం చాలు, సెగపప్పు, మినపప్పు, ఆవాలు, జీల కర్ర- అన్నీ కలిపి రెండు చెంచాలు, కరిఏపాకు-నాలుగు రెబ్బలు

తయారుచేయు విధానం :

పల్లీలు, నాలుగు ఎండుమిర్చిని నూనె లేకుండా వేయించుకోవాలి, కాస్త చల్లారాక పల్లీలు పొట్టు తీసి ఎండుమిర్చితో కలిపి పొడి చేసుకోవాలి.

తరువాత బాణలిలో నూనెవీసి పొయ్యి మీద పెట్టుకోవాలి. అందులో తాలింపు దినుసులు, కరివేపాకు మిగిలిన ఎండుమిర్చి వేసి.. వేగాక అన్నం, పల్లీల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/