ఆగ‌స్ట్ 4 వ‌ర‌కూ సంజ‌య్ రౌత్‌ కు ఈడీ క‌స్ట‌డీ

Sanjay Raut
Sanjay Raut

ముంబయిః ప‌త్రాచాల్ భూ కుంభ‌కోణం కేసులో శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌ అర్టెయిన విషయం తెలిసిందే. అయితే సంజ‌య్ రౌత్‌ను ఆగ‌స్ట్ 4 వ‌ర‌కూ ఈడీ క‌స్ట‌డీకి త‌ర‌లించారు. సంజ‌య్ రౌత్‌ను 8 రోజుల పాటు త‌మ క‌స్ట‌డీకి అప్ప‌గించాల‌ని ఈడీ న్యాయ‌స్ధానాన్ని కోరింది. మ‌రోవైపు సంజ‌య్ రౌత్ అరెస్ట్ రాజ‌కీయ దురుద్దేశంతో కూడుకున్న‌ద‌ని, ఆయ‌న గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతూ గ‌తంలో స‌ర్జ‌రీ చేయించుకున్నార‌ని రౌత్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు నివేదించారు.

సంజ‌య్ రౌత్‌ను ఆగ‌స్ట్ 4 వర‌కూ ఈడీ క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆపై రౌత్‌ను న్యాయ‌స్ధానం నుంచి ఈడీ కార్యాల‌యానికి త‌ర‌లించారు. ఇక సంజ‌య్ రౌత్‌కు మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే బాస‌ట‌గా నిలిచారు. తాము ఎవ‌రి ఒత్తిళ్ల‌కూ, బెదిరింపుల‌కు లొంగ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. బాలాసాహెబ్ ఆశ‌యాల వెన్నింటి ఉంటున్న సంజ‌య్ రౌత్ నిజ‌మైన శివ‌సైనికుడని ఠాక్రే అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/