రైతు కోరికను తీర్చిన బండి సంజయ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఓ రైతు కోరికను తీర్చాడు. ప్రస్తుతం సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ఐలాపుర్ లో సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో ఐలాపూర్ గ్రామ సమీపంలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండగా.. ఆయనను చూసి రైతు తన పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నాల్సిందిగా కోరాడు.

రైతు కోరిక మేరకు బండి సంజయ్ ట్రాక్టర్ ఎక్కి దుక్కిదున్నారు. అనంతరం ఆయన తన పాదయాత్రను కొనసాగించారు. సంజయ్ ట్రాక్టర్ తో దుక్కిదున్నడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పాదయాత్రలో కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. చాలా గ్రామాల్లోని సర్పంచులు తమ ఆస్తులను అమ్ముకుని అడుక్కునే దుస్థితి ఏర్పడిందన్నారు. నిధులు మంజూరు చేయకుండా గ్రామాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. నేటికీ సంజయ్ పాదయాత్ర 13 వ రోజుకు చేరింది. శనివారం కోరుట్ల మండలం యూసఫ్ నగర్ నుంచి యాత్ర ప్రారంభమైంది.