షూటింగ్ లో గాయపడ్డ బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం సంజయ్..’కేడీ’ అనే కన్నడ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర సన్నివేశాల్లో భాగంగా బాంబు పేలుళ్ల దృశ్యాలను చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సంజయ్ దత్ మోచేయి, ముఖానికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. సంజయ్ కి గాయాలు కావడం తో వెంటనే ఆయన్ను హాస్పటల్ లో చేర్పించారు.

ఈ ప్రమాదం జరగడం తో షూటింగ్ ను ఆపివేశారు. బెంగళూరులోని మగడి రోడ్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కూడా నటిస్తోంది. ఫైట్ మాస్టర్ రవి వర్మ సమక్షంలో ఈ సీన్ షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో షూటింగ్‌లో వినియోగించేందుకు ఉంచిన బాంబు ఒక్కసారిగా పేలింది. దాంతో సంజయ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సంజయ్ దత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే కేజీఎఫ్ సినిమాలో అధీరా గా నటించి మెప్పించారు.