ఇదే నా చివరి సీజన్: సానియా సంచలన ప్రకటన

టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నానని వెల్లడి

Sania reveals she is retiring from tennis
Sania reveals she is retiring from tennis

2022 సీజన్ తనకు చివరిదని టెన్నిస్ సంచలం సానియా మీర్జా ప్రకటించి షాకిచ్చింది. టెన్నిస్ నుంచి తానూ రిటైర్ కాబోతున్నానని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఓటమి తర్వాత సానియా మీర్జా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ, ‘ఇది నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఇందులో ఆడుతున్నాను. నేను మొత్తం సీజన్‌లో ఆడగలనో లేదో తెలియదు. కానీ, నేను మొత్తం సీజన్‌లో ఉండాలనుకుంటున్నాను.’ అంటూ పేర్కొంది . అయితే సానియా ప్రస్తుతం అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి ఈ గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

కరోనా లాక్ డౌన్ వార్తల కోసం: https://www.vaartha.com/corona-lock-down-updates/