ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలింపు

Hyderabad: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిని ప్రగతి భవన్ ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. తానూ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వచ్చానని తెలిపారాయన. అయితే అనుమతి లేదని జేసీని పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ కాకపోతే కేటీఆర్ ను కలుస్తానంటూ జేసీ దివాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు ఆయన్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/