చిత్తూరు జిల్లాలో కరోనా పెరగడానికి అదే కారణం

టిడిపి నేత బోండా ఉమ

bonda uma maheswara rao
bonda uma maheswara rao

చిత్తూరు: ఏపిలో కరోనా ప్రారంభయయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు సొంతగా ఒక్కరూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు చేయలేదని టిడిపి నేత బోండా ఉమ మహెశ్వరరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుతం ఇచ్చే రూ.1000 లో కూడా సగం కొట్టేశారని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు అధికమవడానికి వైయస్‌ఆర్‌సిపి నాయకులే కారణమని అన్నారు. అందుకు సంబందించిన వీడియోలను తాము డిజిపి ఇచ్చామన్నారు. శ్రీకాళహస్తీలో వైయస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ర్యాలీ చపట్టడంతోనే అక్కడ భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయని,అధికారులకు కూడా కరోనా వచ్చిందన్నారు. వైయస్‌ఆర్‌సిపి నాయకులు స్వార్ధం కోసం ప్రజలు ప్రాణాలను బలిపెట్టోందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఇంట్లోనే కూర్చుంటున్నారని, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేస్తు, ప్రధాని , మేధావులతో మాట్లాడుతున్నారని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/