య‌శోద ఫస్ట్ లుక్ టీజర్ అప్డేట్

య‌శోద మూవీ కి సంబదించిన ఫస్ట్ లుక్ టీజర్ అప్డేట్ వచ్చేసింది. సమంత ప్రధాన పాత్రలోహరి-హరీష్ లు సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్న మూవీ యశోద. విడాకుల తర్వాత వరుస సినిమాలతో బిజీ గా సామ్..ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ‘య‌శోద’ ఒక‌టి. ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ను సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని నిర్మాత‌లు అధికారికంగా తెలియ‌జేశారు.

శివలెంక కృష్ణప్రసాద్ శ్రీదేవి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘యశోద’ పూర్తిగా సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. ‘ఫ్యామిలీ మాన్ 2’ తో నార్త్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్న సమంత ఈసారి పాన్ ఇండియా మూవీతో మన ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకి మంచి స్పందన రావడంతో నిర్మాత మరియు దర్శకులు టీజర్ మీదుండే అంచనాలని దృష్టిలో ఉంచుకుని అద్భుతంగా కట్ చేసినట్టు సమాచారం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం లో సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్ , ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్నారు.