సైదాబాద్‌ ఘటన మరవక ముందే ఓల్డ్ సిటీలో మరో దారుణం

సైదాబాద్‌ ఘటన మరవక ముందే ఓల్డ్ సిటీలో మరో దారుణం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారీ అత్యాచార ఘటన నుండి ఇంకా ప్రజలు బయటకు రాకముందే..నగరంలో మరో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. స్కూల్‌ విద్యార్థిని ప్రవైట్ పార్ట్శ్ తాకుతూ శునకానందం పొందుతున్న కీచకుడిని స్థానికులు చితక్కొట్టి పోలీసులకు అప్పజెప్పిన ఘటన ఓల్డ్ సిటీ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ..

ఉప్పుగూడ రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మైనర్ బాలికపై ఓ యువకుడు కన్నేశాడు. గత కొద్దీ రోజులుగా బాలిక ఒంటరిగా కనిపిస్తే ఆమెతో నీచంగా ప్రవర్తిస్తూ..తాకారని చోట తాకుతూ ఇబ్బందిపెడుతూ వస్తున్నాడు. రోజు రోజుకు అతని వేధింపులు ఎక్కువ కావడంతో ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది ఆ బాలిక. రోజులాగానే బాలికని వేధిస్తుండగా గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక ప్రైవేట్ పార్ట్స్‌ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు అతడి ఫై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.