నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్న పవన్

Pawan-Kalyan-Responds-On-Nampally-Fire-Accident

అమరావతిః నాంపల్లి అగ్ని ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో బాధితులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని జనసేనాని విజ్ఞప్తి చేశారు. గాయాలపాలైన వారికి, అస్వస్థతకు గురైనవారికి మెరుగైన చికిత్సను అందించాలని సూచించారు. భవనాలలో రసాయనాలు, ఇంధనాలు నిల్వ చేయడం వల్ల ఈ ఘోరం చోటు చేసుకుందని ప్రాథమిక సమాచారం ఉందని, నివాస ప్రాంతాల్లో ప్రమాదానికి ఆస్కారం ఇచ్చే వాటిని నిల్వ చేయకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు.