సమంత అంత పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఉండడానికి కారణం అదే..

కామన్ గా పెళ్లి చేసుకున్నాక హీరోయిన్ల ఫిజిక్ మారిపోతాయి. ఆలా మారిపోయిన ఫిజిక్ తో వారిని గుర్తుపట్టడం కూడా కష్టమే. కొంతమంది మాత్రం పెళ్లి తర్వాత కూడా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. ఈ వరుసలో సమంత ముందుంటుంది. పెళ్లి చేసుకొని నాల్గు ఏళ్లు అవుతున్నప్పటికీ సమంత ఫిజిక్ లో ఏమాత్రం తేడాలు లేవు. అసలు ఇంత ఫిజిక్ గా ఎలా ఉంటుందా అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఆమె ఆలా ఉండడానికి కారణం ఆమె ప్రతి రోజు చేసే వర్కూట్స్ అనే చెప్పాలి.

సినిమాలతో..ఫ్యామిలీ తో ..ఇతర వ్యాపారాలతో ఎంత బిజీ గా ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద పెడుతుంటుంది. క్రమం తప్పకుండా జిమ్ లో గంటల పాటు వర్కౌట్స్ చేస్తూ..వందల కేజీల బరువు తేలిగ్గా ఎత్తేస్తుంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో సమంత తన వర్కౌట్స్ కు సంబంధించిన ఓ వీడియోని షేర్ చేసింది. ఇందులో సమంత కొన్ని ఇంటెన్స్ ఎక్సర్సైజ్ లు చేస్తూ కనిపిస్తోంది. ఇంతలా కష్టపడుతుంది కాబట్టే పెళ్లి తర్వాత కూడా ఆమె పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.