మరోసారి పవన్ మూవీ ఛాన్స్ కొట్టేసిన సూపర్ ఉమన్

వకీల్ సాబ్ మూవీ లో సూపర్ ఉమన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న నటి లిరిషా..మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ లో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ..రానా తో కలిసి భీమ్లా నాయక్ మూవీ చేస్తున్నాడు. యువ డైరెక్టర్ సాగర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని.. తెలుగులో ‘భీమ్లా నాయక్’ పేరుతో.. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లో సూపర్ ఉమన్ గా వకీల్ సాబ్ మూవీ తో గుర్తింపు తెచ్చుకున్న లిరిషా కీలక పాత్రలో నటిస్తుంది. భీమ్లా నాయక్ సెట్లో పవన్ కల్యాణ్‌ తో దిగిన ఫోటోను లిరిషా తన ఇన్‌స్టగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. భీమ్లా నాయక్ షూటింగ్ మూడ్ అంటూ
ఆ ఫోటో కు క్యాప్షన్ పెట్టింది.