ముంబై లో సమంత కొత్త ఇల్లు కొనుగోలు చేసిందా..?

Samantha-At-Shaakuntalam-Trailer-Launch
Samantha shifts to Mumbai

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఇదే హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతుంది. కొద్దీ నెలల క్రితం సామ్ మయోసైటిస్ అనే వ్యాధి బారినపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి బారినపడిన దగ్గరినుండి దీనికి సంబదించిన చికిత్స తీసుకుంటూ సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడం తో మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు సిద్దమవుతుంది. సెట్స్ ఫై ఉన్న సినిమాలతో పాటు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

ఈ క్రమంలో ఈ భామ అమెరికన్ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్’కు హిందీ రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పింది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే దీన్ని రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటె సమంత అతి త్వరలో ముంబై కి మకాం మారుస్తున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆమె పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టిని సారించబోతోందని… ఈ క్రమంలో అక్కడ ఉండేందుకు ముంబైలో ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. మూడు పడక గదులున్న ఆ ఇంటికి ఆమె రూ. 15 కోట్లు చెల్లించిందని చెపుతున్నారు. అయితే ఈ అంశంపై సమంత నుంచి కానీ, ఆమె టీమ్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు.