మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే రఘునందన్ సవాల్

బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కు దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. దుబ్బాక లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు , సొంత జాగలో ఇల్లు నిర్మిస్తే..రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని అన్నారు. ఆదివారం దుబ్బాకలోని చెల్లాపూర్ వార్డులో నిర్వహించిన “ప్రజా గోస – బీజేపి భరోసా” కార్నర్ సమావేశంలో రఘునందన్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భాంగా రఘునందన్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్లు గడిచిన చెల్లాపూర్ వార్డులో ఇళ్లు లేని నిరుపేదలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టించలేదని విమర్శించారు. దీనిపై అసెంబ్లీలో తాను ప్రశ్నిస్తే కేటీఆర్ తనపై ఎగతాళిగా మాట్లాడడం బాధాకరమన్నారు. దుబ్బాకలో తనని ఓడగొట్టేందుకు ప్రచారం చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. తనని ఓడగొట్టాడానికి జిమ్మిక్కులు అవసరం లేదని , దుబ్బాక లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు , సొంత జాగలో ఇల్లు నిర్మిస్తే..రాబోయే ఎన్నికల్లో తానే పోటీ చేయనని అన్నారు.