ఇన్ స్టా లో ఏకంగా 20 మిలియన్ల ఫాలోవర్స్

అత్యధిక పాలోవర్స్ దక్కించుకున్న సౌత్ హీరోయిన్ గా సమంత రికార్డు

Samantha record on social media
Samantha record on social media


స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో అత్యధిక పాలోవర్స్ దక్కించుకున్న సౌత్ హీరోయిన్ గా నిలిచింది. ముఖ్యంగా చైతూతో బ్రేకప్ చెప్పిన తర్వాత ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అవ్వడం ను గమనిస్తున్నాం అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆమె తన మార్కెట్ ను కూడా విస్తరించుకుంటూ ఉంది. మొన్నటి వరకు తెలుగు.. తమిళ్ లో మాత్రమే ఈమె నటించింది. కాని ఇక మీదట ఈమె చేయబోతున్న సినిమాల్లో ఎక్కువ శాతం పాన్ ఇండియా సినిమాలే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సమంత ఇన్ స్టా లో ఏకంగా 20 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో ఈమె ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగింది. సమంత ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్ లకు చేరడంతో ఆమె యాడ్ పోస్ట్ రేటు భారీగా పెరుగుతుందట. మార్కెట్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం చిన్న పోస్ట్ కు కూడా లక్షల రూపాయలు సమంతకు ముట్టనున్నాయని తెలుస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/