వంద కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతున్న అఖండ

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతుంది. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీగా గత వారం భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం రికార్డ్స్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటీకే పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన బాలయ్య..వంద కోట్ల వైపు పరుగులు పెడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ కలెక్షన్లను రాబడుతోంది. మామూలుగా బాలయ్య సినిమాలు అమెరికాలో పెద్ద ఎత్తున విడుదలవుతాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు యూఎస్ తో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, యూఏఈల్లో కూడా ‘అఖండ’ కుమ్మేస్తుంది. ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు డిమాండ్ చేస్తుండటంతో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ‘అఖండ’ ప్రత్యేక షో వేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. ప్యారిస్ లోని పాథే లా విల్లెట్ థియేటర్ లో ‘అఖండ’ షో వేసేందుకు నిర్మాతలు సర్వం సిద్ధం చేశారు. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 7.45 గంటలకు స్పెషల్ షో వేస్తున్నారు.