జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌

Hon’ble CM Unfurls the National Flag and Participate in Independence Day Celebrations at IGMS

అమరావతిః విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిఎం జగన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం అందుకున్నారు.

వేడుకల్లో భాగంగా 12వ కంటిజెంట్స్ నిర్వహించిన పరేడ్‌ను సీఎం జగన్ తిలకించారు. ఆ వాహనంలో ఆయన వెంటన సీఎస్ శమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. అలాగే, 10 బ్యాండ్స్ ప్రదర్శన నిర్వహించనున్నారు. స్వాత్రంత్య వేడుకల సందర్భంగా వివిధ శాఖల శకటాలను సిద్ధం చేశారు. సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ‘ఎట్ హోం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు నేతలు, అధికారులు హాజరుకానున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/